యోగా లేదా జిమ్.. ఏది బెస్ట్ ఆప్షన్?

https://www.teluguglobal.com/h-upload/2023/07/06/500x300_792350-yoga-vs-gym.webp
2023-07-06 20:03:06.0

Yoga vs Gym: వ్యాయామాల్లో ఎన్నో రకాలున్నాయి. మనకు కావాల్సిన ప్రయోజనాన్ని బట్టి వ్యాయామం రకాన్ని ఎంచుకోవాలి.

వ్యాయామాల్లో ఎన్నో రకాలున్నాయి. మనకు కావాల్సిన ప్రయోజనాన్ని బట్టి వ్యాయామం రకాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు కొందరికి జీవితంలో మానసిక ప్రశాంతతముఖ్యం, మరికొందరికి బాడీ ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం. అలాగే యువత చాలామంది కండలు తిరగాలనుకుంటారు. మరి ఎవరెవరు ఎలాంటి వ్యాయామాలు ఎంచుకోవాలి?

వ్యాయామాల్లో జిమ్ వర్కవుట్లు, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, పిలాటీస్, యోగా, స్విమ్మింగ్.. ఇలా చాలారకాలున్నాయి. శారీరక ధృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోరుకునేవాళ్లు ఇతర వ్యాయామాలకు బదులు యోగాను ఎంచుకోవడం బెటర్.

యోగాతో బాడీ ఫ్లెక్సిబిలిటీతో పాటు హార్మోనల్ బాలెన్స్ సరిగ్గా ఉంటుంది. ఒత్తిడి, యాంగ్జైటీ లాంటివి తగ్గుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగాతో పాటు ఏరోబిక్స్ వ్యాయామాలు కూడా మంచి ఎంచుకోవచ్చు.

యాక్టివ్ లైఫ్‌స్టైల్ కోసం స్విమ్మింగ్ బెస్ట్ ఆప్షన్. రోజూ స్విమ్మింగ్ చెయ్యడం ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. హార్ట్ రేట్, బీపీ కంట్రోల్‌లో ఉంటాయి.

బరువు తగ్గాలనుకునేవాళ్లు, డయాబెటిస్, బీపీ ఉన్నవాళ్లు రెగ్యులర్ కార్డియో వ్యాయామాలు చేయడం మంచిది. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, త్రెడ్‌మిల్ లాంటి వ్యాయామాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.

బాడీ షేప్ కోరుకునేవాళ్లు, మజిల్ బిల్డింగ్ కోసం వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్‌‌సైజులు చేయాలి.

Yoga,Gym,Health Tips
yoga benefits, works better, Gym Vs yoga, gym benefits, difference, Yoga, Gym, Health Tips, Health, Work Out

https://www.teluguglobal.com//health-life-style/yoga-vs-gym-which-is-better-work-for-you-945877