2024-12-13 09:23:44.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/13/1385517-chiru.webp
మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలో ఆపేసి బన్నీ ఇంటికి వెళ్లున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలో ఆపేసి బన్నీ ఇంటికి వెళ్లున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరు రాకతో అక్కడ ఏం జరుగుతుందోనని హైటెన్షన్ నెలకొంది. ఈ విషయం తెలిస్తే అటు మెగా అభిమానులు సైతం వేలాదిగా చేరుకునే అవకాశం ఉంది. దీంతో అక్కడి పరిసరాలు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు వైద్య పరీక్షల కోసం బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బన్నీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇంకోవైపు, చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, సోదరుడు శిరీష్ చేరుకున్నారు. పుష్పా-2 మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ను కోర్టులో ప్రవేశ పెట్టేందుకు పోలీసుల రెడీ అవుతున్నారు.
Megastar Chiranjeevi,Allu Arjun,Chikkadapally Police Station,Pushpa-2 movie release,Sandhya Theatre,Gandhi Hospital