రంగారెడ్డి కలెక్టరేట్‌లో విచారణకు హాజరైన మోహన్ బాబు

2025-02-03 11:25:40.0

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు మంచుమోహన్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని జిల్లా కార్యాలయానికి వచ్చారు. మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి సబ్‌కలెక్టర్‌.. ఇద్దరినీ విచారణకు పిలిచారు. ఈ క్రమంలో మోహన్‌ బాబు, మనోజ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్దిరోజుల క్రితం తన పీఎతో మోహన్‌బాబు లేఖ పంపించారు. బాలాపూర్‌ మండలం జల్‌పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్‌ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. మోహన్‌బాబు వేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ఎదుట మంచు మనోజ్‌ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.

తాజాగా ఇవాళ మోహన్‌బాబు కలెక్టరేట్‌కు వచ్చారు. ఆ తర్వాత మనోజ్‌ కూడా కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను కలిశారు. మోహన్‌బాబుతో పాటు మరోసారి మనోజ్ కలెక్టరేట్‌కు వచ్చారు. తన వద్దనున్న కొన్ని డాక్యుమెంట్లను మనోజ్ కలెక్టర్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. కాగా, గతకొన్ని రోజుల క్రితం టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిపై ఒకరు మనోజ్, మోహన్ బాబు ఇద్దరూ ఫిర్యాదులు చేసుకున్నారు. మంచు మనోజ్ నుంచి తనకు ముప్పు ఉందని మోహన్ బాబు, మంచు విష్ణు నుంచి తనకు ముప్పు ఉందని మనోజ్ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎవరికి వారు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

Manchu Family,Manchu Manoj,Actior Manchu Mohan Babu,Ranga Reddy collector office,Kongarakalan,Jalpalli village,Manchu laxmi,Manchu vishunu