రంజీల్లోకి కింగ్‌ కోహ్లీ

https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398176-kohli.webp

2025-01-28 02:23:51.0

ఎల్లుండి నుంచి రైల్వేతో జరిగే మ్యాచ్‌ లో ఢిల్లీ తరపున బరిలోకి

 

కింగ్‌ కోహ్లీ దేశీయ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగబోతున్నాడు. ఫామ్‌ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న విరాట్‌ సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్‌ ఆడబోతున్నాడు. 30వ తేదీ నుంచి రైల్వేస్‌ తో జరిగే మ్యాచ్‌ లో ఆయుష్‌ బదోనీ సారథ్యంలో కోహ్లీ ఆడబోతున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్‌ సంఘం అధికారికంగా ప్రకటించింది. 2012లో ఢిల్లీ తరపున కోహ్లీ చివరిసారిగా ఉత్తర్‌ ప్రదేశ్‌ తో రంజీ మ్యాచ్‌ ఆడారు. మంగళవారమే కోహ్లీ ఢిల్లీ రంజీ టీమ్‌ తో జాయిన్‌ అవుతారని మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. కింగ్‌ కోహ్లీ రాక నేపథ్యంలో టీమ్‌ సెక్యూరిటీని పెంచారు. మరో స్టార్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ కర్నాటక తరపున రంజీ బరిలోకి దిగబోతున్నాడు. హరియాణతో జరిగే మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని కర్నాటక టీమ్‌ తరపున రాహుల్‌ ఆడబోతున్నాడు. ముంబయి తరపున ఇప్పటికే ఒక రంజీ మ్యాచ్‌ ఆడిన రోహిత్‌ శర్మ, యశస్వీ జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఢిల్లీ తరపున బరిలోకి దిగిన రిషబ్‌ పంత్‌ 30 నుంచి ప్రారంభమయ్యే తదుపరి రంజీ మ్యాచుల్లో ఆడటం లేదు. భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌ తో త్వరలో జరగబోయే వన్‌ డే సిరీస్‌ క్యాంప్‌ లో వీరు పాల్గొననున్నారు.