https://www.teluguglobal.com/h-upload/2025/01/23/1396906-rohit-rishab.webp
2025-01-23 05:42:56.0
బరిలో సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా ,పంజాబ్ పక్షాన శుభ్‌మన్ గిల్.. మ్యాచ్‌కు దూరంగా విరాట్ కోహ్లీ
జమ్ము-కశ్మీర్, ముంబయి జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరగనున్నది. రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబయి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. జమ్మ-కశ్మీర్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. మరోవైపు సౌరాష్ట్రతో మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. ఢిల్లీ జట్టుకు రిషభ్ పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆసీస్ పర్యటనలో మెరుగైన బ్యాటింగ్ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీకి ఆడుతాడని వార్తలు వచ్చాయి. అయితే అతను లేకుండానే సౌరాష్ట్రతో ఆడుతున్నది. అయితే మెడ నొప్పి కారణంగానే కోహ్లీ బెంచ్‌కు పరిమితమై ఉండొచ్చని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా కూడా ఆడుతున్నాడు. పంజాబ్ పక్షాన శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగాడు.