రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ కు రేవంత్‌ ఘన స్వాగతం

2024-10-15 07:56:31.0

రోడ్డు మార్గంలో దామగుండం బయల్దేరిన కేంద్ర మంత్రులు, సీఎం

https://www.teluguglobal.com/h-upload/2024/10/15/1369044-cm-revanth-rajnath.webp

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీప్రాంతంలో నేవి రాడార్‌ స్టేషన్‌ భూమి పూజ కోసం విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కు మంగళవారం బేగంపేట ఎయిర్‌ పోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి దామగుండం అటవీ ప్రాంతానికి హెలీ క్యాప్టర్‌ లో బయల్దేరాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో బయల్దేరారు. రాజ్‌నాథ్‌ తో పాటు సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, శాసన మండలి చీఫ్‌ విప్‌ మహేందర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

indian navy radar station,damagundam,vikarabad forest,defence minister rajnath singh,cm revanth reddy,central ministers kishan reddy,bandi sanjay