రఘురామను టీవీ చర్చలకు పిలవద్దు- విజయసాయిరెడ్డి లేఖ

2022-06-28 21:33:34.0

రఘురామకృష్ణంరాజును టీవీ చర్చలకు పిలవద్దని కోరుతూ పార్లమెంట్ వ్యవహారాలను ప్రసారం చేసే సంసద్‌ టీవీకి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. సంసద్‌ టీవీ చర్చలకు రఘురామకృష్ణంరాజును పిలుస్తూ ఆయన్ను వైసీపీ ఎంపీగా చూపుతున్నారని చానల్‌ సీఈవోకు రాసిన లేఖలో విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారు. రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలకు, వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. రఘురామపై అనర్హత వేటు పిటిషన్‌ స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి రఘురామ […]

రఘురామకృష్ణంరాజును టీవీ చర్చలకు పిలవద్దని కోరుతూ పార్లమెంట్ వ్యవహారాలను ప్రసారం చేసే సంసద్‌ టీవీకి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. సంసద్‌ టీవీ చర్చలకు రఘురామకృష్ణంరాజును పిలుస్తూ ఆయన్ను వైసీపీ ఎంపీగా చూపుతున్నారని చానల్‌ సీఈవోకు రాసిన లేఖలో విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారు.

రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలకు, వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. రఘురామపై అనర్హత వేటు పిటిషన్‌ స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

కాబట్టి రఘురామ మాటలకు విశ్వసనీయత ఉండదని, ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవన్నారు. 17వ లోక్‌సభ కాలం ముగిసే వరకు రఘురామకృష్ణంరాజును సంసద్‌ టీవీ చర్చలకు పిలవొద్దని లేఖలో విజయసాయిరెడ్డి సూచించారు.

విజయసాయిరెడ్డి లేఖ రాయడంపై స్పందించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు… తనను పార్టీ నుంచి బహిష్కరించకుండా చర్చలకు పిలవద్దని లేఖలు రాయడం సరికాదన్నారు. కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించి లేఖలు రాసుకోవాలన్నారు.

 

Aandhra Pradesh,Parliament TV,Parliamentary Party Leader,Raghuram Krishna Raju,TV debates,vijayasaireddy,YSRCP