రతన్‌ టాటా అంతిమయాత్ర ప్రారంభం

2024-10-10 10:49:53.0

వర్లి శ్మశాన వాటికలో సాయంత్రం అంత్యక్రియలు

దేశీయ పారిశ్రామిక దిగ్గం, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌, పద్మవిభూషన్‌ రతన్‌ టాటా అంతియ యాత్ర ప్రారంభమైంది. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన అర్ధరాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్స్‌ నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభించారు. వర్లి శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్నారు. రతన్‌ టాటాను చివరిసారిగా చూసేందకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రతన్‌ టాటా అమర్‌ రహే అని నినదించారు. రతన్‌ టాటా అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరపున హోం మంత్రి అమిత్‌ షా అంత్యక్రియలకు హాజరవుతారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Rathan tata,TATA Group Chairmen,Final Journey,Funeral at Worli Crematorium