2024-10-10 09:15:59.0
మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా ‘భారతరత్న’ ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
https://www.teluguglobal.com/h-upload/2024/10/10/1367890-ratantara.webp
టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై మహారాష్ట్ర సర్కార్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలో మధ్యాహ్నం అత్యవసరంగా భేటీ అయిన మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అనంతరం, దేశానికి ఆయన చేసిన సేవలకుగాను దేశ అత్యున్నత పురస్కారం అయిన ‘భారతరత్న’ ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మహారాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం నిర్ణయించింది. ఆయన మరణ వార్త తెలిసి యావత్ లోకం శోక సముద్రంలో మునిగిపోయింది. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కన్నీటి పర్యంతయ్యారు.
వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతికి ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నివాళులర్పించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూడా స్పందించారు రతన్ టాటా మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం భారతదేశానికి దుఃఖ దినమని ఆయన అభివర్ణించారు. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్ర పటానికి పూలు వేసి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు ముంబై బయల్దేరారు. అక్కడాయన రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం క్యాబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా రతన్ టాటాకు క్యాబినెట్ సంతాపం ప్రకటించింది. అనంతరం అజెండాను వాయిదా వేసి సమావేశాన్ని ముగించారు. చంద్రబాబుతో పాటు లోకేశ్ ముంబైయికి బయల్దేరు.
Ratan Tata,Maharashtra Goverment,Cm Eknath Shinde,Cm Chandrababu,Mukesh Ambani,Piyush Goyal