రథసప్తమికి పటిష్ట బందోబస్తు

2025-01-28 13:52:27.0

ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి : అధికారులకు ఏఈవో ఆదేశం

https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398376-ratha-sapthami.webp

రథసప్తమికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. రథసప్తమి ఏర్పాట్లపై మంగళవారం అన్నమయ్య భవన్‌లో ఆయన సమీక్షించారు. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా 2 లక్షల మంది వరకు భక్తులు తరలివచ్చే అవకాశముందని.. భక్తుల రద్దీకి తగినట్టుగా ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌, అత్యవసర సేవలందించాల్సిన టీముల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. భక్తుల రద్దీకి తగినట్టుగా అన్నప్రసాదాలు సిద్ధం చేయాలన్నారు. ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు వర్చువల్‌గా పాల్గొనగా, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో మణికంఠ, సీఈ సత్యనారాయణ, అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ, అధికారులు శేషారెడ్డి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Tirumala,TTD,Rathasapthami,Arrangements