రన్‌వేపై పల్టీలు కొట్టిన విమానం

2025-02-18 04:20:52.0

ప్రమాద సమయంలో విమానంలో 80 మంది.. 18మందికి గాయాలు

కెనడాలోని టొరెంటో విమానాశ్రయంలో విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్‌ సమయంలో విమానం పల్టీలు కొట్టింది. దీంతో పైకప్పు ఎగిరిపోయింది. ప్రమాదానికి గురైన డెల్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికాలోని మిన్నె పోలిస్‌ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పియర్సన్‌ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగిన తర్వాత అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 76 మంది ప్రయాణికులు 4గురు సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రులను దగ్గరల్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు విమానాశ్రయవర్గాలు ఎక్స్‌ వేదికగా వెల్లడించాయి.

Delta Airlines CRJ 900,Crashed,Settled upside down,At Toronto Pearson Airport,ALL passengers survived