2024-10-16 09:37:56.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/16/1369555-kishan-reddy.webp
సైబర్ నేరాల అవగాహన అంబాసిడర్‌గా హీరోయిన్ రష్మిక మందన్నాని కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
టాలీవుడ్ నటి రష్మిక మందానన్నాను సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.ఈ సందర్బంగా రష్మిక ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాము. ఇప్పుడు సైబర్ క్రైమ్ అత్యధిక స్థాయిలో ఉంది. నా డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి బాగా వైరల్ చేశారు.ఆ ఫేక్ వీడియోని వైరల్ చేశారు. ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను.
అందుకే నేను భారత ప్రభుత్వం తో కలిసి సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం చేస్తున్నానని’ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్‌కు జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన రష్మికను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, దేశంలో సైబర్ భద్రతకు జాతీయ అంబాసిడర్‌గా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో సరైన అవగాహన కల్పించడంలో మీ సహకారం ఎంతో ఉపయోగపడుతుందని అభిలాషిస్తున్నట్లు’ తన ట్వీట్‌లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Rashmika Mandanna,Union Minister Kishan Reddy’,Cybercrime Coordination Centre,Cybercrime,Fake video,Pm modi