రష్యా తరపున యుద్దం చేస్తున్న 16 మంది భారతీయులు అదృశ్యం

2025-01-17 15:04:09.0

ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న 12 మంది మరణించారు

రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో రష్యా తరపున పోరాడుతున్న 16 మంది భారతీయులు మిస్సింగ్ అయినట్లు విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. క్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో 126 మంది భారతీయులు పాల్గొన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. వీరిలో 96 మంది సైన్యం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. వీరిలో కొందరు స్వదేశానికి తిరిగొచ్చారని వెల్లడించారు. ఇప్పటి వరకు యుద్ధంలో పోరాడుతూ 12 మంది మరణించారని తెలిపారు. అక్కడే ఉండిపోయిన వారిని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 126 మంది భారత పౌరులు రష్యా సైన్యంలో పని చేశారని తెలిపారు. 96 మందిని రష్యా ఆర్మీ నుంచి డిశ్చార్జ్‌ చేయడంతో వారు దేశానికి తిరిగివచ్చినట్లు చెప్పారు. మరోవైపు రష్యా సైన్యంలో చేరిన వారిలో 12 మంది భారతీయ పౌరులు మరణించారని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రస్తుతం రష్యా ఆర్మీలో 18 మంది భారతీయులు మిగిలి ఉన్నట్లు చెప్పారు. అయితే వీరిలో 16 మంది ఆచూకీ తెలియడం లేదని అన్నారు

Russia,Ukraine,External Affairs Minister Randhir Jaiswal,indians,Russian Army,international news