రాచకొండ పరిధిలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

https://www.teluguglobal.com/h-upload/2024/09/21/1361389-drugs.webp

2024-09-21 03:53:30.0

రెండు వేర్వేరు కేసుల్లో హాష్‌ ఆయిల్‌, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నఎస్‌వోటీ పోలీసులు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు పెద్దమొత్తంలో డ్రగ్స్‌ పట్టుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో హాష్‌ ఆయిల్‌, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మీర్‌ పేట పరిధిలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 2.5 లీటర్ల హ్యాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఆదిభట్ల పరిధిలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 3.8 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్‌బాబు మధ్యాహ్నం వెల్లడించనున్నారు. 

Heavy Drugs Seized,in Rachakonda,Hash oil,cannabis chocolates