రాజంపేట జైల్లో పోసానికి తీవ్ర అస్వస్థత

2025-03-01 09:31:55.0

Posani was seriously ill in Rajampet Jail

సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే జైలు అధికారులు ఆయన్ను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిందిన సంగతి తెలిసిందే. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

జనసేన నాయకుడు జోగినేని మణి 2025 ఫిబ్రవరి 24వ తేదీన పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోసానిపై 196, 353(2), 111 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి26వ తేదీన హైదరాబాద్‌లో గచ్చిబౌలి నివాసంలో పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి పోసానిని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Posani Krishna Murali,Rajampet Jail,Jogineni Mani,Hyderabad,Obulavaripalle Police Station,YCP,YS Jagan,CM Chandrababu,Nara lokesh,Minister Anitha