2025-02-19 02:54:43.0
రామ్ చరణ్ సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కచ్చితంగా హిట్ అవుతుందన్న బుచ్చిబాబు
రామ్‌చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం విదితమే. జాన్వీకపూర్ ఈ మూవీలో హీరోయిన్. Rc16 (వర్కింగ్ టైటిల్) పేరుతో రూపొందుతున్నది. తాజాగా నటుడు బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘బాపు’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ సినిమాపై ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ఆయన మా నుంచి భౌతికంగా దూరమై ఏడాది అవుతున్నది. ‘ఉప్పెన’ సినిమా విడుదల సమయంలో ఆయన చేసిన పని ఇంకా గుర్తున్నది. థియేటర్ గేట్ నుంచి నిలబడి సినిమా బాగుందా అని వచ్చిన వారందరినీ అడిగేవారట. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నేను ప్రస్తుతం తీస్తున్న రామ్ చరణ్ సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. రామ్‌చరణ్, శంకర్ కాంబోలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ ఆశించినస్థాయిలో అలరించలేకపోవడంతో ఆయన అభిమానులు Rc16పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Ram Charan,Janhvi Kapoor,RC 16,Buchi Babu Sana,Pan-Indian sports drama