2025-02-02 07:11:14.0
రామ్‌దేవ్ బాబా, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
https://www.teluguglobal.com/h-upload/2025/02/02/1399621-ram-deva.webp
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌పై కేరళ కోర్టులోని ఓ కోర్టులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలతో రామ్‌దేవ్, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేరళ డ్రగ్ ఇన్ స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 1న విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. అయితే, శనివారం జరిగిన విచారణకు వారిద్దరూ హాజరుకాలేదు. దీంతో వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, పతంజలి అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీకి చెందిన పది ఉత్పత్తులపై ప్రభుత్వం గతంలోనే వేటు వేసింది. ఆ ఉత్పత్తులకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో విడుదల చేసిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ వాటి తయారీ లైసెన్స్ ను రద్దు చేసింది.
Ramdev Baba,Patanjali,Court of Kerala,Non-bailable arrest warrant,Drug Inspector,Patanjali MD Acharya Balakrishna,PM MODI,Divya Pharmacy