2025-01-06 15:25:02.0
ప్రతిపక్షాలు గొంతు చించుకోవడం ఏంటి? : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
రాళ్లు రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్లు, క్రషర్లు, ఇండస్ట్రీ భూములకు రైతుభరోసా ఇవ్వాలా అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. సోమవారం షాబాద్ మండలం సర్దార్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.12 వేల చొప్పున ఇస్తామని చెప్తుంటే కోతలు అని ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం 25,35,963 మంది రైతులకు రూ.20,616.88 కోట్లు రుణాలు మాఫీ చేశామన్నారు. అయినా ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్ రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు రూ.1,108 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.2 వేల కోట్లతో కోహెడలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Raithu Bharosa,Real Estate ventures,Hills,Roads Industries Lands,Thummala Nageshwar Rao