2024-12-15 05:38:37.0
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి.ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 జరగనుంది.
రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 జరగనుంది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎగ్జమ్‌కు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించడంలేదు. దీంతో పలువురు అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజి కేంద్రాన్నిటీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావాలని.. ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. ఫలితాలు త్వరలోనే ఇస్తామన్నారు. 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఆది, సోమవారాల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబరు 29న ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు పరీక్ష జరుగుతోంది
Group 2 exams,144 Sec,Chairman Burra Venkatesham,TGPSC,Hyderabad,Telangana goverment,CM Revanth reddy