2025-02-10 08:57:14.0
అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్
చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్‌ను బీఆర్‌ఎస్ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రంగరాజన్‌ను అడిగి ఆరోజు ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యింది.. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదన్నారు.దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగరాజన్‌ను పరామర్శించే సమయంలో కేటీఆర్ వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర నేతలున్నారు.
KTR Meet,Chilkur temple chief priest,Rangarajan,Attacked by protectors of Hinduism,Telangana govt