2025-01-31 10:56:29.0
రాష్ట్రపతిపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
https://www.teluguglobal.com/h-upload/2025/01/31/1399205-soniya-gandhi.avif
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఓల్డ్ పూర్ లేడీ అని సంబోధించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిటిష్ కాలంలో నాటి మైండ్‌సెట్ నుంచి కాంగ్రెస్ బయటికి రాలేదని విమర్శించింది. భారత దేశంలో తొలి ఆదివాసీ రాష్ట్రపతి పట్ల సోనియా కామెంట్స్ మొత్తం అహంకారానికి ఈ మాటలు నిదర్మనమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నెలకొన్న సమానత్వం విలువలను ఇది అమానం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారని సోనియా కాస్తంత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతిపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ముర్ముపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీ వంటి నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ద్రౌపది ముర్ము ఆదివాసీ కుటుంబం నుండి వచ్చారని, ఆమె ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జమీందారీ మనస్తత్వం ఆమె రాష్ట్రపతిగా ఉండటాన్ని అంగీకరించలేకపోతోందని విమర్శించారు. అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Sonia Gandhi,President Draupadi Murmu,Old Poor Lady,BJP,BJP MP Sukanta Mazumdar,Parliament meetings,Adivasi family,Rahul gandhi,PM MODI,Speaker om birla,MP Priyaka gandhi