2024-11-11 06:13:25.0
కార్తికమాసం రెండో సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున కార్తిక దీపాలను వెలిగిస్తున్న భక్తులు
కార్తికమాసం రెండో సోమవారం సందర్భంగా భద్రాచలం గోదావరి వద్ద భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి నది తీరాన పుణ్యస్నానాలు ఆచరించి గోదావరిలో కార్తిక దీపాలను వదిలారు. భక్తులు భద్రాద్రి ఆలయంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధర్మగుండంలో స్నానాలు చేసి కోడె మొక్కులు చెల్లిస్తున్నారు.ఆలయ ప్రాంగణంలో మహిళలు పెద్ద ఎత్తున కార్తిక దీపాలను వెలిగించారు. దీపాలు వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయిని భక్తుల నమ్మకం. పరమేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వమిస్తున్నారు. వేములవాడ శివనామస్మరణతో మారుమోగుతున్నది.
జయశంకర్ జిల్లా కాళేశ్వరంలో కార్తీక శోభ సంతరించుకున్నది. తెల్లవారు జాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి మారేడు ఆకులతో చేసిన దండను సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం దేవాలయంలో పారిజాతం ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష కార్తిక దీపాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
All major temples,Across the state,Thronged with devotees,Sri Bhadradri Seeta Ramachandra Swamy Temple,Sri Raja Rajeshwara Swami Temple