రాష్ట్రాన్ని రైజింగ్‌ తెలంగాణగా అభివృద్ధి చేయడమే నా కల

2025-01-10 07:18:24.0

ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్‌ సిటీ పోటీ పడుతుందన్న సీఎం రేవంత్‌ రెడ్డి

రాష్ట్రాన్ని రైజింగ్‌ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కల అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైటెక్‌ సిటీలోని సీఐఐ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌లో సీఐఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… హైదరాబాద్‌లో ఫోర్త్‌ సిటీ.. ఫ్యూచర్‌ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్‌ సిటీ పోటీ పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌ను కాలుష్యరహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రిక్‌ వాహనాలకు రిజిస్ట్రేషన్‌, రోడ్డు పన్ను తొలగించామన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్‌ సిద్ధమౌతున్నది. వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ను అనుసంధానించే రేడియల్‌ రోడ్లు నిర్మించబోతున్నాం. ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రానికి ఉండబోతున్నది. నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. రాష్ట్రానికి తీర ప్రాంతం లేదు.. అందుకే డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నాం. పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో కంపెనీలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని సీఎం తెలిపారు.

CM Revanth Reddy,Participates,Inauguration,CII National Council Meeting,At CII Green Business Centre,Hitec City,Hyderabad.