రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం తగదు : డిప్యూటీ సీఎం

2024-12-15 09:51:59.0

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.54వేల కోట్ల అప్పులు చేసింది. బీఆర్ఎస్ చేసిన అప్పులకు నెలకు రూ. 6,722 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని.. రైతుల అప్పులు కూడా 21వేల కోట్లు చెల్లించామని తెలిపారు.లెక్కలపై శాసన సభలో చర్చించేందుకు మేము సిద్ధం అని భట్టి తెలిపారు. సంక్రాంతి తరువాతే రైతు భరోసావేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నదాతలను ప్రొత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తాము బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లుగా అబద్ధాలు చెప్పలేమని.. వారి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురుకు పాఠశాల హాస్టల్‌లో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Deputy CM Bhatti Vikramarka,CM Revanth Reddy,Raithu Bharosa,Assembly,Guruku School Hostel,Khammam,KTR