2025-02-11 09:00:17.0
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది.
కాంగ్రెస్ అగ్రనేత వరంగల్ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు వచ్చి… ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ కు వెళ్లాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. పర్యటన అనంతరం ఈ రాత్రి 7.30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఆయన రైల్లో తమిళనాడుకు బయల్దేరాల్సి ఉంది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విద్యార్థులతో రైల్లో అయన ముఖాముఖి నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.
Rahul Gandhi,Hyderabad,Tamil Nadu,Chennai,Kazipet Railway Station,Parliament meetings,CM Revanth reddy,BRS Party,KCR,KTR