రాహుల్ ద్రవిడ్ కారుకు రోడ్డు ప్రమాదం.. వీడియో వైరల్

2025-02-05 04:34:20.0

మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

భారత క్రికెట్ మాజీ హెడ్ కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న కారు, ఓ గూడ్స్ ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్రావిడ్ కు గాయాలు కాకపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం ఆటో డ్రైవర్ తో ద్రావిడ్ వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్‌ వాగ్వాదానికి దిగడం కనిపిస్తోందిఅయితే ఈ ప్రమాదానికి కారణం.. ద్రవిడ్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా లేదా ఆటో డ్రైవర్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా అనేది స్పష్టంగా తెలియలేదు. 

Rahul Dravid,car road accident,Bangalore,Cricket fans,Auto driver,BCCI,ICCI,Rohith sharma