2025-01-21 08:13:25.0
ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ ఆగ్రహం
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో మంగళవారం ఈటల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారిపై ఈ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై చేయి చేసుకున్నారు. ఈటల చేయిసుకోగానే బీజేపీ కార్యకర్తలు ఆయనపై దాడికి చేశారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. పేదలు కొనుక్కున్న జాగాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు. భూములు కొనుక్కున్న పేదల సమస్యలపై కలెక్టర్, సీపీతో మాట్లాడాను. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కవుతున్నారు. కూల్చివేతలు తప్ప.. పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ఈటల ధ్వజమెత్తారు.
BJP MP Etela Rajender,Slapped,On Cheek Of Real Estate Agent,Pocharam Municipality,Medchal District