2015-05-06 21:31:13.0
రూపం మార్చుకునే రోబోలను సినిమాల్లో చూస్తుంటాం కదా! వాస్తవానికి ప్రస్తుతం ఉన్న రోబోలు ఇలా చేయలేవు. వాటిని తయారు చేసిన లోహం, వాటికి ఇంధనం ఇచ్చేందుకు బయటి నుంచి ఉన్న ఏర్పాట్లు ఇందుకు అడ్డంకిగా మారతాయి. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఇబ్బందిని అధిగమించే సింథటిక్ పాలిమర్ జెల్ ను అభివృద్ధి చేశారు. ఇది అంతర్గతంగా లభించే రసాయన శక్తితో చలిస్తూ బాహ్యస్వరూపాన్ని మార్చకోగలదు. ఈ జెల్‌తో రోబోలను తయారు చేస్తే అవి అనుకున్న […]
రూపం మార్చుకునే రోబోలను సినిమాల్లో చూస్తుంటాం కదా! వాస్తవానికి ప్రస్తుతం ఉన్న రోబోలు ఇలా చేయలేవు. వాటిని తయారు చేసిన లోహం, వాటికి ఇంధనం ఇచ్చేందుకు బయటి నుంచి ఉన్న ఏర్పాట్లు ఇందుకు అడ్డంకిగా మారతాయి. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఇబ్బందిని అధిగమించే సింథటిక్ పాలిమర్ జెల్ ను అభివృద్ధి చేశారు. ఇది అంతర్గతంగా లభించే రసాయన శక్తితో చలిస్తూ బాహ్యస్వరూపాన్ని మార్చకోగలదు. ఈ జెల్‌తో రోబోలను తయారు చేస్తే అవి అనుకున్న రూపంలోకి మారగలవు. ఏకకణ జీవి యూగ్లీనా కాంతి సమక్షంలో సంకోచ, వ్యాకోచాలతో కాంతి సమక్షంలో చలిస్తూ శరీరాన్ని అనుకున్న రూపంలోకి మార్చుకుంటుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని స్పీరోబెంబో పైరిన్ (ఎస్పీ), బెలసోవ్ – జెబటోన్‌స్కీ (బీజడ్) జెల్‌లను ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. ఇవి కాంతి సమక్షంలో తమ రూపాన్ని మార్చుకుని స్వయంగా చలించగలవు. ఈ రెండింటిని కలిపి ఎస్పీ- బీజడ్ జెల్‌ను రూపొందించారు. వీటి ఆధారంగా తయారు చేసిన రోబోలు బాహ్యస్వరూపం మార్చుకోవడమే కాకుండా స్వయంగా చలించగలవు.