2025-01-11 12:10:50.0
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు రూ. 10 లక్షలతో పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు.
https://www.teluguglobal.com/h-upload/2025/01/11/1393631-pavan.webp
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత డబ్బు రూ. 10 లక్షలతో పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల బుక్స్ ఆయన అధికంగా కొన్నారు. వీటిలో ఎక్కువ డిక్షనరీలు తీసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్.
ఆ లైబ్రరీ కోసం ఆయన ఈ పుస్తకాలను కొన్నట్టు తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో యువతకు పుస్తక పఠనం అలవాటు చేయాలని పవన్ భావిస్తున్నారు.పవన్ కల్యాణ్ కు బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉందన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఎప్పుడు సమయం దొరికినా పుస్తక పఠనంలో నిమగ్నమవుతారు. తాజాగా తన సొంత డబ్బు రూ. 10 లక్షలతో పవన్ కల్యాణ్ పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు.