రూ.100 కోట్ల క్లబ్‌లోకి తండేల్ సినిమా

2025-02-16 11:43:57.0

తండేల్ సినిమా విడుదలైన 9 రోజుల్లోనే రూ.100 కోట్లు క్లబ్‌లోకి చేరింది

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, మలయాళ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతుంది. సినిమా విడుదలైన 9 రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టినట్లు సినీ మేకర్స్ ప్రకటించారు. ఈ వీక్ రిలీజైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రియల్ లైఫ్ స్టోరీ.. మంచి క్లాసిక్ మెలోడీ సాంగ్స్, నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ ఇలా అన్నీ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతోంది. స్టోరీ నేరేషన్, మేకింగ్ చక్కగా వర్కౌట్ అవడంతో తండేల్ చిత్ర యూనిట్ రిలీజ్ ముందు నుంచే మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

రియల్ లైఫ్ స్టోరీ.. మంచి క్లాసిక్ మెలోడీ సాంగ్స్, నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ ఇలా అన్నీ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతోంది. స్టోరీ నేరేషన్, మేకింగ్ చక్కగా వర్కౌట్ అవడంతో తండేల్ చిత్ర యూనిట్ రిలీజ్ ముందు నుంచే మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన రియాల్ స్టోరీ ఆధారంగా ‘తండేల్’ మూవీని చందు మొండేటి తెరకెక్కించారు. శ్రీకాకుళం జిల్లాలోని కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి పొరపాటున పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లగా.. అక్కడ కోస్ట్ గార్డు అధికారులు పట్టుకుంటారు. వారిని రక్షించుకునేందుకు కుటుంబసభ్యులు ఏం చేశారు.? ఈ కథకు లవ్ స్టోరీ, ఎమోషన్స్, దేశభక్తిని మిక్స్ చేసి ‘తండేల్’ను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అద్భుతంగా రూపొందించారు

Tandel movie,Rs 100 crore club,Hero Naga Chaitanya,Sai Pallavi,Geeta Arts Banner,Allu Arvind,Music by Devishri Prasad,Directed by Chandu Mondeti