రూ.22 వేల కోట్లతో విశాఖ, విజయవాడలో మెట్రో రైల్‌

2024-12-02 15:23:54.0

రెండు ప్రాజెక్టుల తొలి దశ డీపీఆర్‌లకు రాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

https://www.teluguglobal.com/h-upload/2024/12/02/1382803-vizag-metro.webp

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరాలు విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్‌ తొలి దశలకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 34.4 కి.మీ.లు, గురుద్వార్‌ నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5.08 కి.మీ.లు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 7.75 కి.మీ.లు.. మొత్తం మూడు కారిడార్లలో కలిపి 46.23 కి.మీ.లు పొడవైన మెట్రో రైల్‌ పనులను రూ.11,498 కోట్లతో చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మూడు కారిడార్ల డీపీఆర్‌లకు ఆమోదం తెలిపింది. విజయవాడ మెట్రో రైల్‌ కారిడార్‌ 1ఏలో భాగంగా గన్నవరం నుంచి పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వరకు, కారిడార్‌ 1బీలో భాగంగా బస్టాండ్‌ నుంచి పెనుమలూరు వరకు మొత్తం 27.75 కి.మీ.ల పొడవైన మెట్రో రైల్‌ కారిడార్లను రూ11,009 కోట్లతో చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, మెట్రో రైల్‌ ప్రాజెక్టు సంయుక్తంగా సమకూర్చే నిధులతో ఈ ప్రాజెక్టులు చేపడుతారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన భూసేకరణ కోసం రూ1,152 కోట్లు ఖర్చు చేయనుంది.