రెండు కప్పలు (Devotional)

2015-08-06 13:01:30.0

ఒక కప్పల గుంపు చెట్లగుండా ఎక్కడికో వెళుతోంది. దారిలో ఒక గుంతవుంటే రెండు కప్పలు దాంట్లో జారిపడిపోయాయి. ఆ రెండు కప్పలూ ఆ గోతినించీ  బయటపడడానికి ప్రయత్నించాయి. గట్టు గుండా పాకుతూ పైకి రావడానికి ప్రయత్నించాయి. ప్రతిసారీ జారి మళ్ళీ నీళ్ళలో పడిపోతున్నాయి. ఇతర కప్పలు గోతి చుట్టూ చేరి “పైకి రావడానికి శ్రమ పడకండి. అలసిపోతారు. కష్టమవుతుంది. అక్కడే  ఉండిపోండి” అని చెప్పాయి. కానీ అవి వినలేదు. ఒక కప్ప నీటినించీ గట్టును పట్టుకుని పైకి […]

ఒక కప్పల గుంపు చెట్లగుండా ఎక్కడికో వెళుతోంది. దారిలో ఒక గుంతవుంటే రెండు కప్పలు దాంట్లో జారిపడిపోయాయి.

ఆ రెండు కప్పలూ ఆ గోతినించీ బయటపడడానికి ప్రయత్నించాయి. గట్టు గుండా పాకుతూ పైకి రావడానికి ప్రయత్నించాయి. ప్రతిసారీ జారి మళ్ళీ నీళ్ళలో పడిపోతున్నాయి.

ఇతర కప్పలు గోతి చుట్టూ చేరి “పైకి రావడానికి శ్రమ పడకండి. అలసిపోతారు. కష్టమవుతుంది. అక్కడే

ఉండిపోండి” అని చెప్పాయి. కానీ అవి వినలేదు.

ఒక కప్ప నీటినించీ గట్టును పట్టుకుని పైకి పాకుతూ గట్టుకు రావడానికి ప్రయత్నిస్తూ ఎగరడానికి ప్రయత్నించి మళ్ళీ నీళ్ళలో ధభీమని పడిపోతూ వచ్చింది.

కప్పలన్నీ వద్దు వద్దు అని వారించినా అవి వినలేదు. చివరికి అట్లా శ్రమపడుతూనే అది చచ్చిపోయి నీళ్ళలో తేలింది.

రెండో కప్పను అవి అట్లాగే వద్దు, వద్దు అని వారించాయి. కానీ అది గట్టుమీదకు పాకుతూ నీళ్ళలో పడుతూ చివరకు ఎట్లాగో గట్టుపైకి చేరుకుంది.

కప్పలన్నీ దాని చుట్లూ చేరి “మేము వద్దని వారిస్తూనే ఉన్నాం కదా! ఎందుకు వినలేదు. ఎందుకు శ్రమపడ్డావు” అన్నాయి.

ఆ కప్ప నాకు చెవుడు అంది. అది చివరిదాకా కప్పలన్నీ తనను ఉత్సాహపరుస్తూ ఎగరమని చెబుతున్నాయనుకుంది.

ప్రాణి జీవన్మరణాలు మాటలమీద ఆధారపడివున్నాయి.

అది జీవితమో, మరణమో మాటలను బట్టి ఉంటుంది. నిరుత్సాహపరిచే మాటల్ని ఆ కప్ప ప్రోత్సహించేవిగా తీసుకుంది.

మరణించిన కప్ప ఉత్సాహాన్ని నీరసపరిచే మాటలు నీరుగార్చాయి. చివరికి దాని మరణానికి కారణమయ్యాయి.

కష్టసమయంలో ఓదార్పు మాటలు, ఆశావహంగా ఉండాలి.

– సౌభాగ్య

Devotional Stories,Telugu Devotional Stories,two frogs,రెండు కప్పలు

https://www.teluguglobal.com//2015/08/07/devotional-story-on-two-frogs/