2025-02-27 16:27:59.0
తెలంగాణ ఏపీ రాష్ట్రాలు మొదట తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్ఎంబీ సూచించింది
తెలుగు, ఏపీ రాష్ట్రాలు మొదట తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్ఎంబీ సూచించింది. రెండు రాష్ట్రాల్లో ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఉన్న వాటర్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్ జలసౌధలో నిర్వహించారు.
తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ, వెంకటేశ్వరరావు, ఇంజినీర్లు సమావేశానికి హాజరయ్యారు.రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే విషయం పై సమావేశంలో చర్చించారు. మే నెలాఖరు వరకు తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఏపీ రాష్ట్రాలు నిన్నటి సీఈల సమావేశం అనంతరం వివరాలు సమర్పించాయి తాగు నీటికి ప్రాధాన్యం ఇస్తూ.. మిగిలినది పంటలకు వాడుకోవాలని తెలిపింది. 15 రోజులకు ఒకసారి నీటి మట్టం పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.
Telangana,AP,KRMB,Atul Jain,Sai Prasad,Nagarjunasagar,Srishailam,CM Revanth reddy,minister Uttam Kumar Reddy