2024-10-08 12:49:37.0
జమ్మూకశ్మీర్ లో బోణీ కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ
https://www.teluguglobal.com/h-upload/2024/10/08/1367383-aap-jk-mla.webp
జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ హర్యానాలో మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. 90 స్థానాల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరువలేకపోయింది. జమ్మూకశ్మీర్ లో మాత్రం చీపురు పార్టీకి ఓదారప్పు విజయం దక్కింది. 90 స్థానాలకు గాను ఒక చోట ఆ పార్టీ అభ్యర్థిని విజయం వరించింది. దోడా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ బీజేపీ అభ్యర్థి గజయ్ సింగ్ పై నాలుగు వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం దక్కించుకుంది.
aam admi party,haryana,jammu kashmir,assembly elections,win only one seat