2024-07-22 12:35:57.0
వినుకొండలో మైనార్టీ యువకుడు రషీద్‌ను నడిరోడ్డుపై నరికి చంపి రాక్షస పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుపరిపాలన అందించాలని ప్రజలు అధికారమిస్తే.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని సీతారాం మండిపడ్డారు.
https://www.teluguglobal.com/h-upload/2024/07/22/1346302-ex-speaker-thammineni-sitaram-angry-that-red-book-constitution-is-being-implemented-in-ap.webp
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, ప్రజల రక్తాన్ని ఏరులుగా పారిస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆముదాలవలసలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 35 హత్యలు జరిగాయని ఆయన చెప్పారు. వందల సంఖ్యలో హత్యాయత్నాలు జరిగాయని తెలిపారు. మహిళలపై అత్యాచారాలకూ తెగబడుతున్నారని మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇళ్లపై దాడి చేయడం దారుణమన్నారు. వారి వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేసి.. తిరిగి వారిపైనే కేసులు పెట్టడంపై తమ్మినేని సీతారాం మండిపడ్డారు. వినుకొండలో మైనార్టీ యువకుడు రషీద్‌ను నడిరోడ్డుపై నరికి చంపి రాక్షస పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుపరిపాలన అందించాలని ప్రజలు అధికారమిస్తే.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని సీతారాం మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయడం ద్వారా ప్రజలకు మేలు చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన మొనగాడు.. మగాడు వైఎస్ జగన్ అని ఆయన చెప్పారు.