రేణూ దేశాయ్ ఇంట్లో తీవ్ర విషాదం

 

2024-11-21 15:10:29.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/21/1379828-renu.gif

ప్రముఖ నటి రేణు దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా తెలిపింది

ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిరేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన తల్లికి సంబంధించిన పాత ఫొటోను అందులో షేర్ చేసిన రేణూ దేశాయ్ ఒక శ్లోకాన్ని అందులో జత చేసింది.

పునరపి జననం పునరపి మరణం..పునరపి జననీ జఠరే శయనం.. ఇహ సంసారే బహుదుస్తారే..కృపయాపారే పాహి మురారే.. మళ్లీ మళ్లీ పుడుతుంటారు.. మళ్లీ మళ్లీ చనిపోతుంటారు. మళ్లీ ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదు’ అంటూ ఆది శంకరాచార్యుల చెప్పిన మాటలను తన పోస్టులో పొందుపరిచింది రేణూ దేశాయ్.దీంతో పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా రేణూ దేశాయ్‌ తల్లికి నివాళులు అర్పిస్తున్నారు.

 

Renu Desai,Pavan kalyan,Mega fans,Akira Nandan,bollywood,tollywood,chiranjeevi