రేపటి నుంచి కులగణన నమోదుకు మరో అవకాశం

2025-02-15 14:11:30.0

కులగణన వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చని సూచించింది. కులగణన వివరాల నమోదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 040-211 11111ను ఏర్పాటు చేసింది. ఎన్యుమరేటర్లు.. ఫోన్‌ చేసిన వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్టు అధికారులు తెలిపారు. కులగణన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని అధికారులు లెక్కతేల్చారు.

Census Survey,Telangana Goverment,CM Revanth reddy,Congress party,KCR,KTR,BRS Party,BJP