2025-01-09 12:12:10.0
రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై చర్చ
కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 26 నుంచి ప్రారంభించనున్న రైతు భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై శుక్రవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్లోని 7వ ఫ్లోర్ లో గల కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లు, డీఆర్డీవోలు, డీఎస్డీవోలు సంపూర్ణ సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రైతుభరోసా విధివిధానాలు ఇప్పటికే ఖరారు చేశారు. రేషన్ కార్డులకు సంబంధించిన విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించి ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల చొప్పున ఎలాంటి వ్యవసాయ భూములు లేని కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలోనే ఖరారు చేసే అవకాశముంది. ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఇప్పటికే 95 శాతం పూర్తయ్యింది. ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా పెట్టుకున్న సెక్షన్లకు మొదటి విడతలో ఇండ్ల మంజూరుపై సీఎం దిశానిర్దేశం చేసే అవకాశముంది.
Telangana Govt,Congress Party,CM Revanth Reddy,Collectors Conference,Ration Cards,Rythu Barosa,Indiramma Indlu,Indiramma Atmeeya Barosa