2025-01-20 14:31:28.0
రేపటి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన క్యాన్సిల్ అయింది.
రేపటి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రద్దు అయింది. నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. క్లాక్ టవర్ సెంటర్‌లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసుల అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తుపై హైకోర్ట్‌లో వాదనలు నడిచాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో బీఆర్‌ఎస్ సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. అనంతరం.. బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్‌ను 27కు వాయిదా వేసింది. రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి విదితమే
KTR,BRS Party,KCR,Telangana high court,Lunch Motion Petition,Raithu Mahadharna,Nalgonda,Mlc kavitha,Former minister jagadeeshwar reddy,Police no permission