రేపు నాన్‌వెజ్ షాపులు బంద్ ఎందుకంటే?

2025-01-29 13:37:18.0

రేపు మాంసం విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

రేపు మహాత్మగాంధీ వర్ధంతి సందర్బంగా నాన్‌వెజ్ షాపులు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాతిపిత వర్ధంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మేక‌, గొర్రెల మండిలు, దుకాణాలు మూసివేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. ఏపీ, తెలంగాణలోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ఈ క్రమంలో ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సూచించారు. గాంధీ అహింసా మార్గాన్ని అందరూ పాటించాలని కోరారు. హింసాత్మక చర్యలు చేపట్టరాదని హెచ్చరికలు జారీ చేశారు. మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ అహింసా మార్గాన్ని అనుసరించమని సందేశాన్ని వ్యాప్తి చేశారు.

Mahatma Gandhi,GHMC,GHMC Commisioner,Telangana govermnet,Non-veg shops,CM Revanth reddy,GHMC Commissioner Ilambariti