రేపు ప్రధాని మోదీతో బీజేపీలు ఎంపీలు భేటీ

2024-11-26 16:15:57.0

తెలంగాణ బీజేపీలు ఎంపీలు ప్రధాని మోదీతో రేపు మధ్యాహ్నం న్యూఢిల్లీలో భేటీ కానున్నారు.

https://www.teluguglobal.com/h-upload/2024/11/26/1381193-pm.webp

తెలంగాణ బీజేపీలు ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీతో రేపు మధ్యాహ్నం న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా ప్రధాని మోదీతో బీజేపీ ఎంపీలు చర్చించనున్నారు. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించే అవకాశాలున్నాయనే ఓ ప్రచారం అయితే సాగుతుంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించడంతోపాటు పలు కీలక అంశాలపై ప్రధానితో జరిగే భేటీలో ఎంపీలు చర్చించే అవకాశముందని టాక్. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపూరి అర్వింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గడ్డం నగేష్ తదితరులు పాల్గొనున్నారు.

PM Modi,Union Ministers G. Kishan Reddy,Bandi Sanjay MP Etala Rajender,Dharmapuri Arvind,Raghunandan Rao,DK Aruna,Konda Vishweshwar Reddy,Telanagana bjp,New Delhi