2015-05-06 21:05:40.0
మానవరహిత రష్యన్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ ఒకటి నియంత్రణ కోల్పోయి తిరిగి భూమి మీదకు దూసుకు వస్తోందని రష్యా అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని వ్యోమగాములకు ఆక్సీజన్, ఆహారం, స్పేస్‌పార్టులతో కూడిన స్పేస్ కార్గోషిప్‌ను రష్యా ఏప్రిల్ 28న అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగించిన కొద్ది గంటల తరువాత దీనికి భూమితో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి ఇది భూ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఇది ఏ దేశం మీద పడుతుందోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. అయితే, […]
మానవరహిత రష్యన్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ ఒకటి నియంత్రణ కోల్పోయి తిరిగి భూమి మీదకు దూసుకు వస్తోందని రష్యా అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని వ్యోమగాములకు ఆక్సీజన్, ఆహారం, స్పేస్‌పార్టులతో కూడిన స్పేస్ కార్గోషిప్‌ను రష్యా ఏప్రిల్ 28న అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగించిన కొద్ది గంటల తరువాత దీనికి భూమితో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి ఇది భూ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఇది ఏ దేశం మీద పడుతుందోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. అయితే, ఈ స్పేస్ కార్గోషిప్ శుక్రవారం మధ్యాహ్నం 1.23 గంటల నుంచి రాత్రి 9.55 గంటల మధ్యలో పసిఫిక్ మహాసముద్రంపై ఉన్న భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూవాతవరణంలోకి ప్రవేశించగానే వెంటనే మండిపోతుందని భరోసా ఇచ్చారు. ఎక్కడైనా చిన్న చిన్న శకలాలు మాత్రమే భూమిని చేరే అవకాశం ఉందని వివరించారు. శాస్త్రవేత్తల ప్రకటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Russian space cargo ship