2024-10-16 12:27:05.0
భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ నిర్ణయం
https://www.teluguglobal.com/h-upload/2024/10/16/1369648-srivari-mettu-ttd.webp
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయ్యింది. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం శ్రీవారి మెట్టు మార్గం మూసి వేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామల రావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి ఘాట్ రోడ్లలో కొండచరియలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. తిరుమలలోని అన్ని డ్యాముల్లో నీటి నిల్వను ఎప్పటికిప్పుడు పరిశీలించాలని, వరద పరిస్థితికి అనుగుణంగా గేట్లు తెరిచి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
Tirumala,Srivari Mettu,Path Way Closed,TTD