2025-03-19 10:03:56.0
జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటన కేసులో రేవంత్‌పై నమోదైన కేసు, సీఎంను కించపరుస్తూ మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టేసి ఉన్నత న్యాయస్థానం
సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రేవంత్ రెడ్డిని అప్పట్లో నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయానలి ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్బంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని చెప్పారు.
మరోవైపు సైఫాబాద్ పీఎస్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని.. ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసును కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్బంగా బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడారని పీపీ చెప్పారు. సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది అన్నారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.
Telangana High Court,Quashes cases,Against Revanth Reddy,KTR