రేవంత్ రెడ్డిని త‌రిమికొట్టేందుకు కొడంగ‌ల్ ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నారు : రాజీవ్ సాగ‌ర్

2025-02-14 16:08:20.0

రేవంత్ రెడ్డి పాల‌న చూస్తుంటే తెలంగాణలో తుగ్ల‌క్ పాల‌న గుర్తుకు వ‌స్తుంద‌ని మేడే రాజీవ్ సాగ‌ర్ అన్నారు

తెలంగాణ సమాజంలో మాజీ సీఎం కేసీఆర్‌కు జీవించే హక్కు లేదని, సామాజిక బహిష్కరణ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన చిల్లర మల్లర రాజకీయాలకు అద్దం పడుతున్నాయని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను నయవంచన చేసిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో ఉన్నాయని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను నేర‌వేర్చ‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు తెలంగాణ‌లో జీవించే హ‌క్కు లేద‌ని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్ మండిప‌డ్డారు. తెలంగాణలో కేసీఆర్ కి జీవించే హ‌క్కు లేద‌న్న రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి పాల‌న చూస్తుంటే తెలంగాణలో తుగ్ల‌క్ పాల‌న గుర్తుకు వ‌స్తుంద‌ని తెలిపారు. ఆలోచ‌న‌లేని విధానాల వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వివ‌రించారు. 

Mayday Rajeev Sagar,Palle Ravikumar Goud,KCR,KTR,MLC Kavitha,BRS Party,CM Revanth reddy,Congress party