2024-12-10 08:49:04.0
ఆశా వర్కర్లపై దాడి చేసిన పోలీసులను డిస్మిస్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించారు. మగ పోలీసులు ఆడ వాళ్ళను ముట్టుకోకూడదు. కానీ నిన్న మగ పోలీసులు ఆడ బిడ్డలను కొట్టారని ఆయన అన్నారు. ఏసీపీ, కానిస్టేబుళ్లు ఆడ బిడ్డల చీర లాగి, బూతులు తిడుతూ కొట్టారని మాజీ మంత్రి పేర్కొన్నారు.హోంమంత్రి శాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ రెడ్డి 24 గంటలైనా ఎందుకు ఒక్క మాట మాట్లాడటం లేదు ఆయన అన్నారు.
ఖాకీ యూనిఫాం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే.. వదిలిపెట్టబోమని కేటీఆర్ పోలీసులను హెచ్చరించారు. ఆశా వర్కర్లకు అండగా ఉంటాం.. వారితో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు. అసెంబ్లీలో కొట్లాడుతాం.. బయట కూడా కొట్లాడుతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాకా.. మేము పోరాడుతామని కేటీఆర్ భరోసా కల్పించారు. ఆశా వర్కర్లేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా? అన్నారు కేటీఆర్. జీతం పెంచుతామని, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు… మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి వస్తే.. మీరు చేసిన దుశ్శాసన పర్వం ఆడబిడ్డలు మర్చిపోరన్నారని కేటీఆర్ అన్నారు.
https://www.teluguglobal.com//telangana/revanth-reddy-is-this-your-respect-for-women-ktr-1088591Asha workers,KTR,police attack,Osmania Hospital,Assembly siege,CM Revanth reddy,BRS Party,ACP,Constables,Job security,insurance facility