2025-02-27 08:31:01.0
సీఎం రేవంత్‌రెడ్డి ఇతరులను నిందించడం మానుకుని పనిపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచన
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకున్న ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను నిందించడంపై కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రికి ఏ పని ఎలా చేయాలో తెలియక ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల నాటి ప్రాజెక్టు పనులను నిపుణులను సంప్రదించకుండానే ప్రారంభించారని, 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకోవడానికి అదే కారణమైందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఇతరులను నిందించడం మానుకుని పనిపై దృష్టి సారించాలని సూచించారు.
కార్మికులు టన్నెల్ లో చిక్కుకుని ఇన్నిరోజులు అవుతున్నా.. ఇప్పటిదాకా వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారని, వారు బతికి ఉన్నారో మరణించారో కూడా ఎవరికి తెలియదని అన్నారు. రేవంత్ రెడ్డి ఇతరులపై నిందలు వేయడం మానుకుని పనిపై దృష్టి పెట్టాలి. సీఎం ప్రవర్తన, మాట తీరు ముఖ్యమంత్రి లాగే ఉండాలని, చీప్ మినిస్టర్ లా ఉండకూడదన్నారు.
KTR,Fire ON CM Revanth Reddy,SLBC tunnel Collapse Issue,CM Allegations On KCR,Cheap Minister