రేవంత్ రెడ్డి రుణమాఫీ మాట నిలుపుకోవాలి : హరీష్ రావు

2025-01-19 12:00:38.0

ముఖ్యమంత్రి రుణ మాఫీ మాట నిలుపుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు

సీఎం రేవంత్‌రెడ్డి మాట నిలుపుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రికి.. అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న రైతుల దుస్థితి మీకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారం మీ రాజకీయ అవసరం తీరుస్తుందేమోగానీ, రైతుల ఆవేదన తీర్చదని స్పష్టం చేశారు. రుణమాఫీ కాలేదు అంటూ బాధలు చెప్పుకుంటున్న మెదక్ జిల్లా టెక్మాల్ మండల రైతుల వివరాలను మీకు పంపుతున్నామని రుణాలు మాఫీ చేసి ఈ రైతుల కన్నీళ్లు తుడవండి అని ట్వీట్టర్ వేదికగా మాజీ మంత్రి కోరారు. రుణమాఫీ కాలేదని పలువురు రైతులు తన వద్దకు వస్తున్న దృష్యాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Loan waiver,BRS Leader Harish Rao,CM Revanth Reddy,Medak District,Tekmal Mandal,BRS Party,KCR,KTR