రేవంత్‌ లో ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు.. అందుకే మైనార్టీలపై వివక్ష

2025-01-12 10:10:54.0

నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌ రెడ్డికి ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్నాయని.. అందుకే మైనార్టీలపై వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్‌ నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌ రెడ్డిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీల కుటుంబాన్ని చూసి కాంగ్రెస్‌ కు మైనార్టీలు ఓట్లేస్తే ఇప్పుడు వాళ్ల నమ్మకాన్ని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వమ్ము చేస్తోందన్నారు. కేసీఆర్‌ పాలనలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. మతకల్లోలాలు నిరోధించడానికి రేవంత్‌ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. గంగాజమునా తెహజీబ్‌ కు ప్రతీకగా ఉన్న తెలంగాణలో ఎందుకు చిచ్చు పెడుతున్నారని ప్రశ్నించారు. మైనార్టీ డిక్లరేషన్‌ అమలు ఏమైందని ప్రశ్నించారు. వెంటనే మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మైనార్టీలకు బడ్జెట్‌ లో రూ.3 వేల కోట్లు కేటాయించి రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, షాదీ ముబారక్‌ తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి రేవంత్‌ రెడ్డి ఎగ్గొట్టారని తెలిపారు. నిజామాబాద్‌ లో తబ్లిఖీ జమాత్‌ కార్యక్రమానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు.

 

Revanth Reddy,RSS Roots,Discrimination on Minorities,Congress Party,Gandhi Family,Kalvakuntla Kavitha