2025-01-08 08:54:41.0
పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే జనవరి 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రైవేటు ఆస్పత్రుల అల్టిమేటం జారీ చేశాయి.
తెలంగాణలో రేవంత్ సర్కార్‌కు ప్రైవేటు ఆస్పత్రుల అల్టిమేటం జారీ చేశాయి. ఈ నెల 10వ తేదీ లోగా రూ. 1000 కోట్లకు పైగానే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని పేర్కొన్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రైవేటు ఆస్పత్రులు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. జనవరి 10 నుంచి ఆరోగ్య సేవలు నిలిచిపోతయానే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు పరిష్కరించకుంటే సేవలు నిలిపివేస్తామని రేవంత్ సర్కారుకు ప్రైవేటు ఆస్పత్రుల హెచ్చరించాయి. బకాయిల విషయమై ప్రభుత్వానికి, ప్రైవేటు ఆసుపత్రులకు మధ్య వివాదం నడుస్తోంది.
గత ఏడాది కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నామని ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 10వ తేదీనుంచి రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటల్స్‌లో వైద్య సేవల్ని నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవోకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాయి.
Arogyashree services,CM Revanth reddy,Telangana,private hospitals,Arogya Shree Network Hospitals,Minister damodara raja narasimha,Telanagana goverment,Yashoda hospitals